Logo
Download our app
మూగ జీవాలతో ప్రయాణికుల ఇబ్బందులు
NEWS   Oct 15,2024 05:28 pm
జగిత్యాల పట్టణంలోని పలు దారుల్లో మూగజీవాలు తిరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పట్టణ బైపాస్ రోడ్డుపై రాత్రిపూట చెట్ల నీడలో అవి సరిగా కనిపించక వాహనదారులు అదుపుతప్పిన సందర్భాలు ఉన్నాయి. భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. భారీ వాహనాలు ఢీకొనడంతో మూగజీవాలు గాయపడిన ఘటనలు ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source