Logo
Download our app
తండ్రిని హతమార్చిన కొడుకుకు జీవితఖైదు
NEWS   Oct 15,2024 05:27 pm
జగిత్యాల: తండ్రిని కొట్టి చంపిన కొడుకుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాపల్లికి చెందిన గడుగు పోచయ్యను కొడుకు గడుగు ప్రభుదాస్ కొట్టి హత్య చేశాడు. జిల్లా న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పు వెల్లడించారు. ప్రభుదాస్ కు జీవిత ఖైదు, రూ. 5వేల జరిమానా విధించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source