Logo
Download our app
బహిరంగ సభను జయప్రదం చేయండి
NEWS   Oct 15,2024 04:41 pm
భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు: ఈనెల 21న నిర్వహించే ఐద్వా రాష్ట్ర మహిళా సంఘం బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం సారపాక సుందరయ్యనగర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలపై దేశంలో దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఐద్వా నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source