Logo
Download our app
అది చిరుత కాదు.. బ్లాక్ పాంథర్
NEWS   Oct 15,2024 01:46 pm
ఖమ్మం జిల్లా జూలూరుపాడు, తల్లాడ మండలాల సరిహద్దులో పెద్దపులి సంచారిస్తుంద‌నే ఘ‌ట‌న‌లో ఆసక్తికర విషయం బయటపడింది. మిర్చి తోటకు కాపలా ఉన్న కుక్కని లాక్కెల్లింది చిరుత పులి అని భావించారు. అయితే అది చిరుత కాదు.. బ్లాక్ పాంథర్ అని అటవీ అధికారులు వెల్లడించారు. పాంథర్‌కి ఎవరూ హాని కలిగించకూడదని అధికారులు హెచ్చరించారు. చుట్టూ పక్కల గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి, వారి సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source