Logo
Download our app
పంగిడి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS   Oct 15,2024 08:01 am
మైలవరం మండలం పొందుగల గ్రామంలో పంగిడి చెరువును మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు పరిశీలించారు. గత నెలలో అకస్మాత్తుగా కురిసిన కుంభవృష్టికి పంగిడి చెరువు కరకట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన స్థానిక నాయకులు పంగిడి చెరువు కట్టకు పడిన గండిని పూడ్చివేశారు.చెరువును అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు చేపడతామన్నారు. స్థానిక నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, వరదల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించారని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source