మైలవరం: 1.60 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
NEWS Oct 15,2024 06:19 am
మైలవరంలో నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైలవరం మేజర్ పంచాయతీలో రూ.1.60 కోట్ల NREGS నిధులతో దేవునిచెరువులో రోడ్లకు, పొందుగల వెళ్లే రహదారి నిర్మాణానికి, 4వ సచివాలయం పరిధిలో, ఇంకా పలు రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో రహదారుల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.