ఎల్లమ్మ ఆలయంలో హుండీ చోరీ
NEWS Oct 15,2024 04:08 am
టేక్మాల్ మండలం కాదులూరు గ్రామ శివారులో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో దొంగలు పడి హుండీని ఎత్తుకెళ్లారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామ శివారులో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. గ్రామ ప్రజల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.