Logo
Download our app
AP: ఈ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు
NEWS   Oct 14,2024 02:42 pm
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో అతి భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చిత్తూరు, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source