రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ బంద్
NEWS Oct 14,2024 12:27 pm
కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలేదని ప్రైవేట్ కళాశాల అసోసియేషన్ (TPDPMA) పిలుపు మేరకు కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కాలేజీ బంద్ నిర్వహించారు. మూడేళ్లుగా కళాశాలల నిర్వహణ భారంగా మారిందని చెప్పారు. దీంతో బకాయిలు చెల్లించేవరకు రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల నిరవదిక బంద్ నిర్వహిస్తున్నామన్నారు.