Logo
Download our app
నీళ్ల బోరింగ్ మరమ్మతులు చేయాలని నిరసన
NEWS   Oct 13,2024 02:11 pm
సుజాతనగర్ గ్రామపంచాయతీ అంబేద్కర్ నగర్‌లో గల శిధిలావస్థకు చేరి పాడైన బోరింగ్ పంపును వెంటనే రిపేరు చేయాలని ఆదివారం ఐక్యవేదిక నాయకులు కాలనీ వాసులతో కలిసి పంపు వద్ద నిరసన తెలిపారు. నీళ్ల బోరింగ్ రిపేరుకు గురై నెలలు గడుస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఐక్యవేదిక మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ చెప్పారు. కాలనీ వాసులందరూ అధికారులకు నేరుగా విన్నవించుకున్న స్పందన లేదన్నారు. ఈ ప్రాంతంలో ఈ ఒక్క బోరింగే ఆధారమని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source