ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేరు
NEWS Oct 13,2024 01:28 pm
బయ్యారం మండలం గౌరారం శాఖ మహాసభ కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్లో కామ్రేడ్ మడకం ఆదెయ్య జెండా ఆవిష్కరణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభకు అధ్యక్షుడిగా మడకం నారాయణ వ్యవహరించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఏజెన్సీలో వైద్యం అందక ఆదివాసులు ప్రాణాలు కోల్పోతుంటే, పాలకులు అభివృద్ధి చేశామని ప్రగల్బాలు పలుకుతున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేక ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆవస్తలు పడుతున్నారని వెల్లడించారు.