Logo
Download our app
రెడ్డి సంఘం, దుంపేట గ్రామస్తుల మధ్య భూవివాదం
NEWS   Oct 13,2024 01:07 pm
కథలాపూర్ మండలం దుంపేట శివారులో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు, దుంపేట శివారులో ఉన్న 2 ఎకరాల 10 గుంటల భూమి తమ గ్రామానికి చెందిందని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులకు రెడ్డి జన సంఘ నాయకుల మధ్య‌ తోపులాట జరిగింది. గత కొంతకాలంగా ఆ భూమిలో మండల రెడ్డి జన సంక్షేమ సంఘం వారు మామిడి చెట్లు, చుట్టు ఫినిషింగ్ చేపించి వాడుకుంటున్నారు. భూమిలోని బోరుతో పాటు ఫినిషింగ్, మామిడి చెట్లను గ్రామస్తులు ధ్వంసం చేశారు. తమ గ్రామానికి చెందిన భూమిని రెడ్డి జన సంక్షేమ సంఘం వారు ఎలా వాడుకుంటారని ప్ర‌శ్నించారు. పోలీసులు ఘ‌ట‌న స్థలానికి వ‌చ్చారు.
⚠️ You are not allowed to copy content or view source