మెట్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు బస్సు
NEWS Oct 13,2024 01:01 pm
మెట్‌పల్లి నుంచి కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వరకు ఎక్స్‌ప్రెస్ బస్సును సోమవారం నుంచి నడుపుతున్నట్లు డిపో మేనేజర్ దేవరాజు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం నిత్యం హైదరాబాదుకు ఆదనపు ఛార్జీలతో బస్సును నడుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ను బొక్కెనపల్లి నాగరాజు, గట్టయ్య, స్వామి, కృష్ణ తదితరులు సన్మానించారు.