Logo
Download our app
ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానం
NEWS   Oct 13,2024 10:58 am
ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన అభ్యర్థులను స్థానిక లైబ్రరీలో ఆ గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. కష్టానికి ఫలితం దక్కిందని, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ ప్రపంచంలో రేయింబవళ్లు కష్టపడి చదివి బనిగండ్లపాడు గ్రామానికి పేరు తెచ్చారని వారు కొనియాడారు. ఐదుగురు అభ్యర్థులు డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు, AEEగా ఇద్దరు ఉద్యోగాలు పొందారని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source