పేలిన గ్యాస్ సిలిండర్ తప్పిన ప్రమాదం
NEWS Oct 13,2024 10:57 am
భద్రాచలం పట్టణంలోని హోటల్ గీతాంజలి వీధిలో ఉన్న ఓ ఇంట్లో మహిళ దీపారాధన చేసింది. అనంతరం ఆరుబయట పనిచేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, రూ. 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.