కమలా హారిస్ కోసం రెహమాన్ వీడియో
NEWS Oct 13,2024 07:10 am
అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 30 నిమిషాల ప్రదర్శన వీడియోను రికార్డ్ చేశారు. ఈ వీడియో కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి మంచి ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియోను ఏఏపీఐ విక్టరీ ఫండ్ ఛానల్లో అక్టోబరు 13న ప్రసారం చేస్తారు. ఏవీస్ లేదా టీవీ ఆసియా సహా దక్షిణాసియా నెట్‌వర్క్‌లలో ప్రసారం చేయాలని ప్లాన్ ఉంది. ఈ వీడియోలో రెహమాన్ హిట్ సాంగ్స్‌తో పాటు, కమల అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన వారి సందేశాలు ఉంటాయి.