Logo
Download our app
కర్రల సమరంలో 70మందికి గాయాలు
NEWS   Oct 13,2024 04:19 am
AP: దసరా ఉత్సవాల్లో హింస చెలరేగింది. కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా దసరా సందర్బంగా బన్నీ ఉత్సవాల్లో భాగంగా కర్రల సమరం జరుగుతుంది. ఈ ఏడాది కూడా కర్రల సమరం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కర్రల సమరం హింసకు దారి తీసింది. కర్రలతో జనం కొట్టుకోవడంతో 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source