Logo
Download our app
పోలీసుల పర్యవేక్షణలో అమ్మవారి నిమజ్జనం
NEWS   Oct 12,2024 05:26 pm
కొత్తగూడెం మున్సిపాలిటీ నాగయ్య గడ్డ రావిచెట్టు ఏరియాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. టూటౌన్ పోలీసులు బుచ్చి రాములు, రమేష్ స్థానిక భవానీ మాలధారులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి నిమజ్జన వేడుకను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు సీఐ రమేష్ కుమార్ సూచనల మేరకు పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source