Logo
Download our app
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూత
NEWS   Oct 12,2024 04:36 pm
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జైల్లో ఉండి, ఇటీవలే బయటికి వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సాయిబాబా 10 రోజుల కిందట నిమ్స్‌లో చేరారు. అయితే, రాత్రి గుండెపోటుతో మరణించారు. సుదీర్ఘకాలం జైల్లో ఉన్న సాయిబాబా గత మార్చి 7న నాగపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా ఆయనకు గుర్తింపు ఉంది.
⚠️ You are not allowed to copy content or view source