Logo
Download our app
కస్టమర్‌పై హోటల్ సిబ్బంది దాడి
NEWS   Oct 12,2024 09:18 am
జగిత్యాల ప‌ట్ట‌ణంలోని బస్‌స్టాండ్ అవుట్‌గేట్ ఎదురుగా నందిని హోటల్లో హోటల్ యజమాని, సిబ్బంది ఓ కస్టమర్‌పై దాడికి పాల్పడ్డారు. జగిత్యాలకు చెందిన కిషన్ హోటల్‌లో టిఫిన్ చేయడానికి వచ్చి, పూరి కోసం అడిగాడు. పూరి లేదంటూనే, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని కిషన్ చెప్పాడు. కిషన్ మరో టిఫిన్ కోసం అడుగుతుండగానే, మాటమాటా పెరిగి హోటల్ సిబ్బందితో పాటు యజమాన్యం కూడా తనపై దాడి చేసిందని కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
⚠️ You are not allowed to copy content or view source