దుర్గమాతను దర్శించుకున్న మెదక్ కలెక్టర్
NEWS Oct 11,2024 09:39 am
మెదక్ జిల్లాలో ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. అంతకుముందు కలెక్టర్ కు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కు వేద ఆశీర్వచనం అందించారు.