దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
NEWS Oct 11,2024 08:34 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జమ్మిగద్దె వద్ద శనివారం రోజున జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంత వాతావరణంలో దసరా వేడుకలను జరుపుకోవాలని సూచించారు. శనివారం రోజున జరిగే దసరా ఉత్సవాలకు సంబంధించి భద్రతాపరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు.