ఘనంగా అమ్మవారి ఊరేగింపు
NEWS Oct 11,2024 04:49 am
కథలాపూర్: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని ప్రధాన కూడాల వద్ద అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి మండలి సభ్యులు భక్తిశ్రద్ధలతో ఊరేగింపు జరిపారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ప్రజలు సుఖ సంతోషాలతో, పాడిపంటలు బాగుండాలని కోరుకున్నారు. దుర్గా దేవి ఆశీస్సులు కథలాపూర్ గ్రామ ప్రజల పైన ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ శంకర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.