Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యత స్వీకరణ
NEWS   Oct 11,2024 04:39 am
నూతనంగా బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం కొలువుతీరింది. బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా షేక్ సబెర బేగం గౌస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. చైర్‌ప‌ర్స‌న్ మాట్లాడుతూ.. త‌న‌పై నమ్మకంతో పార్టీ ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source