తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ
NEWS Oct 10,2024 07:59 am
జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో చోరీ జరిగింది. తోట ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో గత రాత్రి దొంగలు పడి 6 లక్షల విలువ గల నగలు, 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. దసరా పండగ సందర్భంగా ఇంటికి తాళం వేసి కరీంనగర్‌కు తోట ప్రసాద్ కుటుంబ సభ్యులు వెళ్లగా, బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న నగదు, నగలు ఎత్తుకెళ్లారని బాధితుడు ప్రసాద్ తెలిపాడు.