Logo
Download our app
పదివేల మందితో సద్దుల బతుకమ్మ
NEWS   Oct 08,2025 11:07 am
నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్యాంక్​ బండ్​పై సద్దుల బతుకమ్మ వేడుకలు జ‌ర‌గ‌నున్నాయి. స్వయం సహాయక బృందాలకు చెందిన 10 వేల మంది మహిళలు బతుకమ్మలతో తరలి వ‌స్తున్నారు. బతుకమ్మ పాటలకు పాదం కలపనున్నారు. ఈ సందర్భంగా పలు శాస్త్రీయ, జానపద సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం రోటరీ పార్కులో ఏర్పాటు చేసిన పాండ్స్‌లో ఆడబిడ్డలు బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. లేజర్​ షో, పటాకులు, తారాజువ్వలతో అంబరాన్నంటేలా సంబురాలు జ‌రుపుతారు.
⚠️ You are not allowed to copy content or view source