Logo
Download our app
సైకిల్‌పై ఫిట్స్.. కింద‌ పడి మృతి
NEWS   Oct 10,2024 04:11 am
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఓ వ్యక్తి సైకిల్ పైనుంచి పడి రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన భూపతిపురం రవి (50) నిన్న రాత్రి సైకిల్ పై వెళ్తూ కాళ్లకల్ బంగారమ్మ ఆలయం వద్ద ఫిట్స్ రావడంతో కిందపడ్డాడు. గిలగిలా కొట్టుకుని మృతి చెందినట్లు వివరించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా రవిగా గుర్తించారు. మనోహరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source