Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
NEWS   Oct 10,2024 04:09 am
మెట్ పల్లి పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ బైక్ ఢీ కొట్టడంతో మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాజు మృతి చెందారు. నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న సమయంలో హోండా షోరూం వద్ద ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source