Logo
Download our app
బతుకమ్మ సంబరాల్లో జిల్లా ఎస్పీ
NEWS   Oct 09,2024 06:39 pm
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని బతుకమ్మ ఘాట్ వద్ద అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source