Logo
Download our app
సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
NEWS   Oct 09,2024 05:15 pm
తాను జైలులో ఉన్నప్పుడు తనను చంపడానికి కుట్రలు చేసినట్లు ప్రచారం జరిగిందని సీఎం చంద్రబాబు సంచలన విషయాన్ని వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై, 53 రోజులు జైలులో ఉన్నప్పుడు జైలుపై డ్రోన్లు ఎగురవేసి, జైలు గదిలో సీసీ కెమెరా పెట్టి తన ప్రతి కదలికను వైసీపీ నేతలు గమనించారన్నారు. జైలులో ఉన్నన్న రోజులు తాను నరకం అనుభవించానని, దోమలు కుడుతుంటే దోమతెర కూడా ఇవ్వలేదని వాపోయారు. అయినప్పటికీ తాను కక్ష తీర్చుకోవడం తన స్వభావం కాదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source