Logo
Download our app
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని దీక్ష
NEWS   Oct 09,2024 04:34 pm
మెట్‌ప‌ల్లి: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మెట్‌ప‌ల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వ‌ద్ద‌ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. బీసీ కులగణన చేపట్టాలని, 60 శాతం ఉన్న బీసీలు అన్ని రంగాలలో వెనుకబాటుకు గురవుతున్నారని, జనాభాలో బీసీలు ఎంత శాతం ఉంటే అంత వాటా ఇవ్వాలని బీసీ జేఏసీ ఛైర్మన్ పుప్పాల లింబాద్రితో పాటు పలువురు డిమాండ్ చేశారు. బీసీ నాయకులు తోగిటి అంజయ్య, ప్రవీణ్, నర్సాగౌడ్, జగన్, రాజారెడ్డి, ప్రవీణ్, తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source