Logo
Download our app
దుర్గమ్మకు కుటుంబ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
NEWS   Oct 09,2024 10:51 am
విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source