Logo
Download our app
రాహుల్ జీ తెలంగాణకు రండి : కేటీఆర్
NEWS   Oct 09,2024 05:03 am
రాహుల్ గాంధీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘హలో రాహుల్ జీ, తెలంగాణ యువత మీరు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేశారు. 8 నెలల తర్వాత కాంగ్రెస్ విడుదల చేసిన ‘జాబ్ లెస్ క్యాలెండర్, జీరో ఉద్యోగాల కారణంగా యువత ఆందోళన బాట పట్టారు. మీరు ఎందుకు మళ్లీ అశోక్‌నగర్‌కు వచ్చి అదే యువతను కలిసి మీరిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పొచ్చు కదా’ అని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source