Logo
Download our app
అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే
NEWS   Oct 09,2024 03:33 am
దేవి నవరాత్రుల సందర్బంగా మల్యాల మండల కేంద్రంలోని తూర్పువాడ, పోచమ్మవాడలో కొలువుదీరిన అమ్మవార్లను చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి, తీర్తప్రసాదాలు అందజేశారు. పోచమ్మవాడ ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ కావాలని MLA కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ముత్యపు శంకర్, సతీష్ రెడ్డి, మల్లేశంతదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source