క్రికెట్ టోర్ని విజేత పోలీస్ టీమ్
NEWS Oct 13,2024 01:21 pm
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద బతుకమ్మ ఘాట్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆఫీసియల్స్ అండ్ ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్ని లో పోలీస్, లాయర్స్, ప్రెస్, కెవి స్కూల్, బిజీసీసీ టీమ్స్ పాల్గొన్నాయి. సోమవారం రోజున జరిగిన లీగ్స్ మ్యాచ్ లలో పోలీస్ టీం, లాయర్స్ టీం ఫైనల్ కి చేరగా మంగళవారం రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోలీస్ టీం లాయర్స్ టీం పైన విజయం సాధించింది. విజేతలకు బిఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్ మోహన్ బహుమతులను అందజేశారు.