Logo
Download our app
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NEWS   Oct 10,2024 12:40 pm
సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటుందని, నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లెపెల్లి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source