విద్యాధరి క్షేత్రంలో ఎంపీ పూజలు
NEWS Oct 08,2024 03:07 pm
వర్గల్ విద్యాధరి క్షేత్రంలో విద్యా సరస్వతి శరన్నవరాత్రి ఉత్సవాలలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈరోజు విద్యాదరి క్షేత్రంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. చదువుల తల్లి శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు