CMRF చెక్కులు పంపిణీ
NEWS Oct 08,2024 03:07 pm
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకుని CM సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న, 40 మంది లబ్ధిదారులకు 18 లక్షల 35 వేల 400 రూపాయల నిధులు మంజూరు కాగా, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.