సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీనంపై కీలక చర్చలు
NEWS Oct 08,2024 12:36 pm
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన చంద్రబాబు.. తాజాగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. వీరిరువురి మధ్య సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ విలీనంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఎంపీలు భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.