హెల్త్ సెంటర్ వద్ద బతుకమ్మ సంబరాలు
NEWS Oct 08,2024 12:46 pm
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఉద్యోగులు, డాక్టర్లు బతుకమ్మలను తయారు చేసిన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసి బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ లింబాద్రితో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.