ఈ నెల 14 నుంచి పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు: డిప్యూటీ సీఎం పవన్
NEWS Oct 08,2024 12:27 pm
రాష్ట్ర వ్యాప్తంగా 14 నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది రూ. 4500 కోట్ల పనులకు గ్రామసభల ఆమోదం తీసుకుని 100 రోజుల్లో 466.13 లక్షల పనిదినాలతో పాటు, 1.07 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించామని పవన్ గుర్తు చేశారు.