ఘనంగా బతుకమ్మ సంబరాలు
NEWS Oct 08,2024 12:21 pm
మెదక్ జిల్లా నర్సాపూర్ ఐసిడిఎస్ కార్యాలయం వద్ద మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలకు జిల్లా ఐసిడిఎస్ అధికారి బ్రహ్మాజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మెప్మా ఉద్యోగులతో పాటు, ఐసిడిఎస్, అంగన్వాడీ మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసిన మహిళలు కార్యాలయం వద్ద బతుకమ్మలు ఏర్పాటు చేసి ఆటలు ఆడి పాటలు పాడారు.